మా ఆయనే విన్నర్.. అరియానా, అవినాష్.. : అమ్మా రాజశేఖర్ భార్య

మా ఆయనే విన్నర్.. అరియానా, అవినాష్.. : అమ్మా రాజశేఖర్ భార్య
ప్రతివారం బిగ్‌బాస్ అతన్ని సేవ్ చేయడం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకూ మింగుడు..

అమ్మా రాజశేఖర్‌ని భరించలేకపోతున్నాం.. ఆయన ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో అని వస్తున్న ప్రచారాన్ని ఆయన భార్య రాధ ఖండిచారు.. బయటి ప్రేక్షకులతో ఇంటి సభ్యులు ఆయన మీద నిప్పులు చెరుగుతున్నారు.. ఆయన కూడా మొదట్లో సరదాగా ఉన్న వ్యక్తి కాస్తా అయిన దానికీ కానిదానికీ అందరి మీదా సీరియస్ అవుతున్నారు.. అభిజిత్, అఖిల్ కూడా మిమ్మల్ని పొగిడేవారంటేనే మీకు ఇష్టం వాళ్లనే సపోర్ట్ చేస్తారంటూ అమ్మా మీద విరుచుకుపడ్డారు.

మొత్తనికి ఇంటి సభ్యులు ఆయన్ని ఎలిమినేట్ చేసే పనిలో ఉన్నారు. కానీ ప్రతివారం బిగ్‌బాస్ అతన్ని సేవ్ చేయడం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకూ మింగుడు పడట్లేదు. ఈ నేపథ్యంలో భార్య రాధ.. మా ఆయన గేమ్ బాగా ఆడుతున్నాడంటూ కితాబు ఇస్తోంది. ఆయన మాట్లాడితే వివాదం అంటున్నారు. అది వివాదం కాదు.. ఆయన వ్యక్తిత్వం. పైకి ఒకలా లోపల ఒకలా ఉండలేరు. ఏదైనా అనిపిస్తే వెంటనే అనేస్తారు. ఆయనకు నటించడం రాదు.

కుళ్లు జోకులు వేస్తారని అంటున్నారు.. ఆయనేమైనా ప్రేక్షకులపైన వేస్తున్నారా.. పక్కనున్న వాళ్లపైనే కదా వేసేది.. హౌస్‌లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా.. మూగ వారిలా ఎలా కూర్చుంటారు.. అయినా ఆయన జోకులు వేస్తున్నది కంటెస్టెంట్స్ పైనే కదా బయట వాళ్ల పైన కాదుగా మరి వాళ్లకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కాలక్షేపానికి కుళ్లు జోకులో మంచి జోకులో ఏవో ఒకటి వేసుకోవాలి కదా అని అంటున్నారు.

ఆయన కచ్చితంగా ఎలిమినేట్ అవ్వరు.. ఆయన లేకపోతే షో చప్పగా సాగుతుంది. అది బిగ్‌బాస్ వాళ్లకీ తెలుసు అందుకే ఆయన్ని సేవ్ చేస్తున్నారు. ఆయనకు చాలా మంది రియల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనపై ట్రోల్స్ పెట్టే వాళ్లు దానికి లైక్ కొట్టే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లు మాకు అవసరం లేదు.. వాళ్ల ఓట్లు కూడా మాకు అక్కర్లేదు అని సీరియస్‌గా అన్నారు.

ఒకవేళ ఆయన ఎలిమినేట్ అయితే షో చూడ్డం మానేస్తా.. విన్నర్ ఆయనే అవుతారన్న నమ్మకం ఉంది.. ఒకవేళ ఆయన కాకపోతే అరియానా, అవినాష్.. వీరిద్దరిలో ఎవరో ఒకరు కావచ్చు. అరియానా గేమ్ బాగా ఆడుతోంది.. ఏదైనా ముఖం మీదే చెప్తుంది.. నా సపోర్ట్ వాళ్లకే..

గేమ్ విషయానికి వస్తే ఆయన బాగా ఆడుతున్నారు. అందరిలో పెద్దవారైనా చిన్నవాళ్లతో పోటీపడి ఆడుతున్నారు. అందుకే ఇప్పటి వరకు ఉన్నారు. దానితో పాటే కోపం కూడా వస్తోంది.. దాన్ని ఆపలేం. ఆయన్ని నెగిటివ్‌గా చూపించినా, పాజిటివ్‌గా చూపించినా కాసులు బిగ్‌బాస్ వాళ్లకే వస్తాయి కానీ మాకేం కాదు. ఆయన్ని కోపిష్టి, సైకో అనే వాళ్లంతా ఆయన ముందుకు వచ్చి అనలేరు. ఆయన బాగా ఆడుతున్నారు.. ఆడేవాళ్లని సపోర్ట్ చేయండి అని అమ్మా రాజశేఖర్ భార్య రాధ ప్రేక్షకులను కోరుతున్నారు.

Tags

Next Story