Bigg Boss lahari shari : ఎవరీ లహరి షారి?

Bigg Boss lahari shari :ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు. 'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై' అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మిస్టర్ మజ్ను పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అనంతరం పంచ అక్షరాల సాక్షి, పంచేద్రియాల సాక్షిగా, పంచ భూతాల సాక్షి నా పంచ ప్రాణాలు మీరే అంటూ అభిమానులను పలకరించాడు. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ని హౌస్ లోకి ఆహ్వానించాడు. అందులో భాగంగా మూడో కంటెస్టెంట్‌గా లహరి షారి ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతోనే నాగ్ కి రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఎవరీ లహరి షారి అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారు. యాంకర్, న్యూస్ రీడర్, జర్నలిస్టు, మోడల్, నటిగా ఫుల్ పాపులర్ అయింది లహరి షారి.. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించింది. అంతేకాకుండా మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబిరెడ్డి తదితర చిత్రాల్లో నటించి మంచి ఫేం తెచ్చుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com