గొంతే కాదు.. మనసు కూడా పెద్దదే.. చిన్నారికి ప్రాణం పోసింది...!

గొంతే కాదు.. మనసు కూడా పెద్దదే.. చిన్నారికి ప్రాణం పోసింది...!
తెలుగు రాష్ట్రాల్లో కార్తికదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్‌‌లో అర్థపావు భాగ్యంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో కార్తికదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్‌‌లో అర్థపావు భాగ్యంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది నటి ఉమాదేవి. తాజాగా బిగ్‌‌‌బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన ఈమె.. రెండోవారంలో ఎలిమినేట్ అయి ఇంటిదారి పట్టింది. నామినేషన్‌ ప్రక్రియలో బూతులు మాట్లాడటం, చిన్న విషయాలకే గొడవకు దిగడం ఆమెకు పెద్ద మైనస్‌గా మారాయి. మొత్తానికి హౌస్‌‌లో అందరిని గడగడలాడించి గయ్యాళి గంపగా పేరు తెచ్చుకుంది. ఇదిలావుండగా బిగ్‌‌బాస్ షోలో వచ్చిన రెమ్యునరేషన్‌ను ఓ మంచి పనికోసం ఉపయోగించి అందరి మనసు దోచుకుంది ఉమాదేవి. దీనితో నెటిజన్లు ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ ఆమె చేసింది ఏంటంటే.. పారితోషికంలోని కొంత మొత్తాన్ని బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యం కోసం అందించింది. ఉన్నంతలో సహాయం చేసి చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీ గొంతేకదు.. మీ మనసు కూడా పెద్దదే మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story