Bimbisara Movie: హీరో నుండి దర్శకుడిగా.. 'బింబిసార' డైరెక్టర్ బ్యాక్‌గ్రౌండ్..
Bimbisara Movie: సినీ పరిశ్రమ ఎప్పుడు, ఎవరిని ప్రేక్షకులు ఎలా పరిచయం చేస్తుందో అస్సలు చెప్పలేము. డైరెక్టర్ అవ్వాలని వచ్చి హీరోలు అయిన వారు ఉన్నారు. హీరోలు అవ్వాలనుకొని విలన్స్‌గా సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు. అలాగే ఈ దర్శకుడు మాత్రం హీరోగా ప్రయోగం చేసి.. అది వర్కవుట్ అవ్వకపోవడం వలనో, లేక నచ్చకపోవడం వలనో డైరెక్షన్‌లోకి అడుగుపెట్టాడు. తనే బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్.
మామూలుగా నిర్మాతల కుమారులు చాలావరకు హీరోలు అవ్వాలన్న కలతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అలాగే ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ వారసుడిగా మల్లిడి వేణు అనే పేరుతో హీరోగా మారాడు వశిష్ఠ్. 'ప్రేమలేఖ రాశా' అనే చిత్రంతో హీరోగా డెబ్యూ చేశాడు. కానీ ఆ మూవీ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. డైరెక్షన్ మీద ఆసక్తిగా హీరోగా ప్రయత్నాలు ఆపేశాడు.
పలువురు డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌లాగా కూడా పనిచేశాడు వశిష్ఠ్. అదే సమయంలో సొంతంగా కథలు రాయడం కూడా మొదలుపెట్టాడు. అయిదేళ్ల క్రితమే 'బింబిసార' కథ పూర్తి చేసుకున్నా కూడా అది ఇప్పటికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్ రామ్‌కు ఈ కథ బాగా నచ్చడంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తానే నిర్మాతగా బింబిసారను తెరకెక్కించాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com