Bimbisara Trailer: విజువల్ వండర్‌గా 'బింబిసార' ట్రైలర్.. కళ్యాణ్ రామ్ కొత్త ప్రయోగం..

Bimbisara Trailer: నందమూరి కుటుంబం నుండి వారసులుగా వచ్చిన హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. ఎప్పుడూ సరికొత్త కథలను, వైవిధ్యభరిమైన పాత్రలను ఎంచుకొని ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతుంటారు కళ్యాణ్ రామ్. అందుకే తన కెరీర్‌లో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. తాను నటిస్తున్న తరువాతి చిత్రం 'బింబిసర'లో ఓ రాజుగా కనిపించి ఆశ్చర్యపరుస్తున్నారు కళ్యాణ్ రామ్.
వశిష్ట దర్శకత్వం వహిస్తున్న బింబిసార.. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా. అంతే కాకుండా ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 5న ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకోవడంతో ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది మూవీ టీమ్. ఈ ట్రైలర్‌లో కళ్యాణ్ రామ్ లుక్‌తో పాటు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న మరొక అంశం విజువల్స్.
రాజుల కాలంనాటి కథ చెప్పడానికి భారీ సెట్స్, కళ్లు చెదిరే విజువల్స్ చూపించాలి. ఇదంతా బింబిసార ట్రైలర్‌లో కరెక్ట్‌గా చూపించాడు దర్శకుడు. పైగా దయ లేని రాజుగా బింబిసార పాత్రలో కళ్యాణ్ రామ్ భయపెట్టిస్తున్నాడు. 'బింబిసారుడంటే మరణశాసనం' లాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌ను కళ్యాణ్ రామ్ అవలీలగా చెప్పి మెప్పించాడు. మొత్తానికి బింబిసార ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com