Bindu Madhavi: బిందు మాధవి పెళ్లిపై తన తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Bindu Madhavi: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది. అందుకే ఇది కేవలం బుల్లితెరకే పరిమితం కాకూడదని.. ఓటీటీ వరకు వెళ్లాలి అన్న ఉద్దేశ్యంతో బిగ్ బాస్ ఓటీటీ అనే ప్రారంభమయ్యింది. ఇక తెలుగులోని ఫస్ట్ సీజన్‌లోనే బిగ్ బాస్ విన్నర్‌గా ట్రాఫీ దక్కించుకుంది ఆడపులి బిందు మాధవి. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన బిందు మాధవి పెళ్లి గురించి తన తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ఫ్యామిలీ వీక్ జరుగుతున్న సమయంలో బిందు మాధవి కోసం తన తండ్రి హౌస్‌లోకి వచ్చారు. అప్పుడు ప్రేక్షకులకు బిందు మాధవితో పాటు తన తండ్రి కూడా నచ్చేశారు. ఇక బిగ్ బాస్ ట్రాఫీ గెలిచిన తర్వాత బిందు మాధవి పెళ్లి గురించి ఆమె తండ్రిని అడగగా.. ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బిందు పెళ్లి గురించి వారు ఆలోచించడం లేదని తేల్చి చెప్పేశారు.
బిందు ఇంజనీరింగ్ చదివేటప్పుడే మంచి సంబంధాలు వచ్చాయని పెళ్లికి ఒత్తిడి చేశారట తన తండ్రి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్నా్ళ్ల పాటు ఇదే జరిగిందట. అయితే తానెప్పుడు పెళ్లి చేసుకోవాలో తనకు తెలుసని, తానేం చిన్నపిల్లని కాదని తండ్రితో చెప్పిందట బిందు. దీంతో బిందు మనసు అర్థం చేసుకున్నా ఆయన.. బిందును ఆకాంక్షలకు, అభిలాషకు పూర్తిగా వదిలేశానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com