22 May 2022 2:13 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Balakrishna: బాలయ్య...

Balakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్ బ్యూటీ..

Balakrishna: అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నట్టు టాక్.

Balakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్ బ్యూటీ..
X

Balakrishna: బిగ్ బాస్ అనేది ఎంతోమందికి కెరీర్ ఇచ్చింది. పెద్దగా ప్రేక్షకులకు తెలియని వారిని.. వారికి పరిచయం చేసింది. అలా ఇప్పుడు ఎంతోమంది నటీనటులుగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. అదే ఆశతో బిగ్ బాస్ తెలుగు ఓటీటీలోకి అడుగుపెట్టింది బిందు మాధవి. తన కెరీర్ కోసమే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టానని ఓపెన్‌గా చెప్పిన బిందు మాధవి.. ట్రాఫీతో పాటు బాలయ్య సినిమాలో ఛాన్స్ కూడా కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.


అఖండ సినిమాతో బాలకృష్ణ మరోసారి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇప్పటికీ అఖండ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని పలు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. దీని తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు బాలయ్య. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నట్టు టాక్. అయితే తనకు కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. తనతో పాటు బాలయ్యకు భార్య పాత్ర కూడా ఉంది. బిగ్ బాస్ ఫైనల్‌కు గెస్ట్‌గా వచ్చిన అనిల్ రావిపూడి.. బిందుమాధవి కోసం తను ఓ పాత్రను సిద్ధం చేస్తానని, అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య సినిమాలోనే ఆ పాత్ర ఉండేలా ట్రై చేస్తానని చెప్పడంతో బాలయ్యకు భార్యగా బిందు మాధవి ఫిక్స్ అయినట్టేనా అని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.



Next Story