Bindu Madhavi: బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి రెమ్యునరేషన్ ఎంతంటే..?

Bindu Madhavi: బుల్లితెరపై ఓ రియాలిటీ షోగా ప్రారంభమయిన బిగ్ బాస్.. ప్రేక్షకుల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అందుకే ముందుగా హిందీలో ప్రారంభమయిన ఈ కాన్సెప్ట్.. సౌత్ భాషల్లో కూడా క్రేజ్ పొందింది. అందుకే ఈ షో కేవలం బుల్లితెరకే పరిమితం కాకూడదని.. ఓటీటీలో కూడా దీనిని ప్రారంభించారు మేకర్స్. అలా తెలుగులో మొదలయిన బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ మొదటి సీజన్‌కు విన్నర్‌గా నిలిచింది బిందు మాధవి.
బిందు మాధవి.. పేరుకు తెలుగమ్మాయి. కానీ తెలుగులో మాత్రం తనకు సినిమా అవకాశాలు ఎక్కువగా రాలేదు. అందుకే కోలీవుడ్ వైపు తన అడుగులు పడ్డాయి. కోలీవుడ్‌లో పక్కింటమ్మాయి పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతే కాకుండా తమిళ బిగ్ బాస్‌లో కూడా తాను కంటెస్టెంట్‌గా పాల్గొంది. కానీ అక్కడ లక్ తనను వరించలేదు. కానీ బిగ్ బాస్ తెలుగులో మాత్రం ట్రాఫీ గెలుచుకున్న మొదటి లేడీ కంటెస్టెంట్‌గా రికార్డ్ సాధించింది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమయిన కొత్తలో బిందు మాధవిని ఎవరూ పట్టించుకోకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకొని విన్నర్‌గా నిలిచింది. అయితే బిందు మాధవికి వారానికి రూ. రెండున్నర నుండి 3 లక్షలు రెమ్యునరేషన్ అందేదని సమాచారం. అంతే కాకుండా విన్నర్ కావడంతో తనకు ట్రాఫీతో పాటు రూ.40 లక్షలు క్యాష్ ప్రైజ్ కూడా అందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com