హీరోయిన్ రిచ్ లైఫ్ : వయసు 26, సంపాదన 29 కోట్లు..!

ఒక్కసారి హీరోయిన్‌గా క్లిక్ అయితే చాలు వరుస ఆఫర్స్, యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ ఇలా లెవల్ మారిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ హీరోయిన్ రేంజ్ అలా ఉంది మరి. ఆమె ఎవరో కాదు.. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు.
హీరోయిన్‌గా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వకముందే ఈ అమ్మడుకి ఫుల్ క్రేజ్ ఉంది.. దానికి కారణం సైఫ్ అలీఖాన్ కూతురు కావడం. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆ క్రేజ్‌ని మరింత డబల్ చేసుకుంది. వరుస సినిమాలు, యాడ్స్‌తో ఫుల్ బిజీ అయిపొయింది. ప్రస్తుతం సారా అలీఖాన్ నికర విలువ అక్షరాలా 29 కోట్ల రూపాయలు. ఆమె నెల సంపాదన 50 లక్షల రూపాయల పైమాటేనట.
ఎంత సంపాదిస్తుందో అంతే రేంజ్‌లో రిచ్ లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోందట. ఆమె వాడేవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్సేనట. ఆ మధ్య కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు బ్లూ కలర్ వాచ్ ధరించి అందర్నీ అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటీ.. ఆ వాచ్ విలువ అక్షరాల 9 లక్షల రూపాయలు. అంతేకాకుండా ఆమె వాడే హ్యాండ్‌బ్యాగ్ ధర 74వేల రూపాయలు. ఇలా నెలకి లక్షల్లో సంపాదిస్తూ చాలా లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది సారా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com