టక్కర్ గా రాబోతున్న బొమ్మరిల్లు 'సిద్ధార్థ్'

తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బొమ్మరిల్లు సిద్ధార్ద్ క్రమంగా కోలీవుడ్ లో బిజీగా మారడంతో టాలీవుడ్ కు దూరమయ్యాడు. అయినప్పటికీ అప్పుడప్పుడూ డబ్బింగ్ సినిమాలతో తెలుగువారిని పలుకరిస్తూనే ఉన్నాడు. తాజాగా టక్కర్ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో తెలుగు నాట సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. నేటి తరం యువతను ఆకట్టుకునేందుకు అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాతో సిద్ధార్ధ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20ఏళ్లు పూర్తవ్వబోతోందట. ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం సిద్ధార్థ్ మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు కూడా పొందినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com