Liger Movie: ఓవైపు 'లైగర్' బాయ్‌కాట్ ట్రెండ్.. మరోవైపు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Liger Movie: ప్రస్తుతం బాలీవుడ్‌కు భారీ దెబ్బే పడుతోంది. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలు కూడా సరిగ్గా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం.. మరోవైపు ట్విటర్‌లో బాలీవుడ్ బాయ్‌కాట్ అంటూ ట్రెండ్స్ స్టార్ట్ అవ్వడం ఆ పరిశ్రమను బాగా దెబ్బతీస్తోంది. ఇక బాయ్‌కట్ బాలీవుడ్ అంటూ ప్రతీ సినిమాకు ముందు హ్యాషటాగ్ బాయ్‌కట్ అని తగిలిస్తే.. త్వరలో విడుదల కానున్న ప్రతీ చిత్రాన్ని ఇలాగే ట్రెండ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇక ఈ బాయ్‌కాట్ సెగ ఫైనల్‌గా లైగర్ వరకు వచ్చింది.
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమే 'లైగర్'. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ జగన్నాధే నిర్మాతగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి మరో నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరించాడు. దీంతో నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ అనన్య పాండే కూడా బాలీవుడ్‌కు చెందినవారు కావడంతో లైగర్ కుడా బాయ్‌కాట్ ట్రెండ్‌లో జాయిన్ అవ్వక తప్పలేదు.
ఓవైపు బాలీవుడ్‌ను ఇష్టపడని వారు బాయ్‌కాట్ లైగర్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తుంటే.. మరోవైపు సపోర్ట్ లైగర్ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ రెండిటి మధ్యలో ఇటీవల పూరీ జగన్నాధ్, ఛార్మీ, విజయ్ దేవరకొండ పాల్గొన్న ఓ ఇంటర్యూ వైరల్ అవుతోంది. ఇందులో లైగర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది మూవీ టీమ్. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉండవచ్చని విజయ్ బయటపెట్టాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com