Brahmaji: ట్రెండింగ్ టాపిక్‌కు బ్రహ్మాజీ కౌంటర్.. అంకుల్ ఏంట్రా అంటూ ట్వీట్..

Brahmaji: ట్విటర్‌లో ఏ విషయం అయినా ఈజీగా ట్రెండ్ అవుతుంది. ఒక నెటిజన్ ఆ ట్రెండ్‌ను మొదలుపెట్టగానే.. అది నచ్చినవారందరూ ఆ ట్రెండ్‌లో జాయిన్ అవుతూ హ్యాష్‌ట్యాగ్‌తో రచ్చ చేస్తారు. అలాగే ఇటీవల యాంకర్ అనసూయ.. ట్వీట్స్ నచ్చని నెటిజన్లు తనను ఆంటీ అని సంబోధిస్తూ.. ఆంటీ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇప్పటికీ ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి కౌంటర్‌గా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్ చేశారు.
ముందుగా అనసూయ చేసిన ఒక్క ట్వీట్.. నెటిజన్లలో ఓ హీరో అభిమానులకు కోపం వచ్చేలా చేసింది. దీంతో వారందరూ తనను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. అందులో భాగంగానే తనను ఆంటీ అనడం మొదలుపెట్టారు. ఆంటీ అంటూ కేసు పెడతానని, బాడీ షేమింగ్ అనేది తప్పు అని వారికి క్లాస్ తీసుకుంది అనసూయ. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తూ ఉండడంతో బ్రహ్మాజీ.. దీనికి తనదైన శైలిలో స్పందించారు.
బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువగా ఫన్నీ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇటీవల ఏం చేస్తున్నారు అంటూ ఫాలోవర్స్‌ను అడిగారు బ్రహ్మాజీ. అప్పుడు ఓ నెటిజన్ 'ఏం లేదు అంకుల్' అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి సమాధానంగా 'అంకుల్ ఏంట్రా.. అంకుల్.. కేసు వేస్తా. వయసు, బాడీ షేమింగా' అంటూ కౌంటర్ ఇవ్వడంతో నెటిజన్లు బ్రహ్మాజీ సమయస్ఫూర్తికి నవ్వుకుంటున్నారు.
Uncle entra.. uncle u.. case vestha.. age.. body.. shaming aa.. 😜 https://t.co/9fbRbXirbJ
— Brahmaji (@actorbrahmaji) August 30, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com