Brahmastra Trailer: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ రిలీజ్.. గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేసిందిగా..!

Brahmastra Trailer: బ్రహ్మాస్త్ర ట్రైలర్ రిలీజ్.. గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేసిందిగా..!
Brahmastra Trailer: నీరు, నిప్పు, అగ్నికి అస్త్రాలుగా ఉండేవారి కథే బ్రహ్మాస్త్రం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Brahmastra Trailer: ప్రస్తుతం సినిమాల్లో గ్రాఫిక్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలు చాలావరకు ఈ గ్రాఫిక్స్ మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఇక బాలీవుడ్ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్రం'.. ట్రైలర్‌లోనే గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేసింది. సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేసింది మూవీ టీమ్.

యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఇదే తెలుగులో 'బ్రహ్మాస్త్రం'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, నాగార్జున లాంటి వారు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తెలుగు ట్రైలర్ కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌ను అందించడం విశేషం.

నీరు, నిప్పు, అగ్ని లాంటి వాటికి అస్త్రాలుగా ఉండేవారి కథే బ్రహ్మాస్త్రం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఆ అస్త్రాలకు సమానంగా శక్తి ఉండే పాత్రలో రణబీర్ కపూర్ కనిపించనున్నాడు. మెయిన్ విలన్ పాత్రలో మౌనీ రాయ్ నటిస్తుండగా.. రణబీర్‌కు సాయం చేసే క్యారెక్టర్‌లో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం ట్రైలర్‌లో గ్రాఫిక్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషించాయి. హాలీవుడ్ రేంజ్‌లో గ్రాఫిక్స్ ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తు్న్నారు. దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా థ్రిల్లింగా అనిపిస్తోంది.

Tags

Next Story