టాలీవుడ్

Pelli SandaD : దర్శకేంద్రుడి బర్త్ డే స్పెషల్.. మరో సాంగ్ రిలీజ్..!

Pelli SandaD : హీరో శ్రీకాంత్ తనయిడు రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సందD’.. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు.

Pelli SandaD : దర్శకేంద్రుడి బర్త్ డే స్పెషల్.. మరో సాంగ్ రిలీజ్..!
X

Pelli SandaD : హీరో శ్రీకాంత్ తనయిడు రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం 'పెళ్లి సందD'.. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి... దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. కాగా తాజాగా దర్శకేంద్రుడి పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. 'బుజ్జులు బుజ్జులు' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాటను చంద్రబోస్ రాయగా, ఈ పాటను బాబా సెహెగల్‌, మంగ్లీ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని విడుదలకి సిద్దం చేస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సినిమాని నిర్మిస్తున్నారు.

Next Story

RELATED STORIES