బుచ్చిబాబుకి బంపరాఫర్.. ఇల్లు లేదా కారు..!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, క్రితిశెట్టి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఉప్పెన.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సినిమా విడుదలకి ముందే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం మాంచి హిట్ దక్కించుకొని భారీ కలెక్షన్ల దిశగా కొనసాగుతుంది. ఇప్పటికే 50 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా 100కోట్ల వైపు పరుగులు పరిగెడుతుంది.
అయితే మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబుకి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బంపరాఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మైత్రి అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. బుచ్చిబాబుని ఇల్లు లేదా కారులో ఏది కావాలో కోరుకోమని అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌కు ఆ రెండూ ఇచ్చినా తప్పు లేదని అభిమానులు అంటున్నారు.
ఇదిలా వుంటే 'డియర్ కామ్రేడ్', 'సవ్యసాచి' సినిమాలతో కొంచెం బ్యాలెన్స్ తప్పిన మైత్రి మూవీ మేకర్స్ మళ్ళీ ఉప్పెన సినిమాతో ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. కాగా బుచ్చిబాబు కూడా తన తదుపరి చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేయనున్నాడని సమాచారం...!
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com