క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే నయం చేయవచ్చు : బాలకృష్ణ

క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే నయం చేయవచ్చు : బాలకృష్ణ
హైదరాబాద్ బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని బాలకృష్ణ ప్రారంభించారు.

క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే నయం చేయవచ్చని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు .హైదరాబాద్ బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. ఆసుపత్రి స్థాపించినప్పుటి నుంచి ఇప్పటి వరకు 2లక్షల 50 వేల మంది వ్యాధి గ్రస్తులు క్యాన్సర్ ను జయించి ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారని గుర్తు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధనకు తన వంతు కృషి చేస్తున్నట్లు బాలయ్య తెలిపారు. మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్‌కు చికిత్స అందుబాటులో ఉందని... ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒక సారి బాడీ చెకప్ చేయించుకోవాలని బాలయ్య సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story