బొమ్మల తాత కన్నుమూత

X
By - Nagesh Swarna |30 Sept 2020 2:35 PM IST
భారతదేశంలో విశేషంగా పాఠకాదరణ పొందిన బాలల మాస పత్రిక 'చందమామ'లో దశాబ్దాల పాటు వేలాది చిత్రాలు గీసిన ఆర్టిస్ట్ శంకర్ కన్నుమూశారు. 97 సంవత్సరాల శంకర్ వయోభారంతో ఎదురైన అనారోగ్యం కారణంగా చెన్నై సమీపంలోని పోరూర్‌లోని స్వగృహంలో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. 1924 జులై 19న జన్మించిన శంకర్ లైన్ డ్రాయింగ్ అప్పట్లో చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. భేతాళ కథలు శీర్షిక కోసం ఆయన వేసిన విక్రమార్కుడు, బేతాళుడు రేఖా చిత్రం పాఠకుల మదిలో నిలిచిపోయింది. 'చందమామ' పత్రికను డిజైన్ చేసిన చిత్రకారులలో ఇంతవరకు సజీవంగా ఉన్నది శంకర్ ఒక్కరే. ఇప్పుడు ఆయన మరణంతో ఆ శకం ముగిసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com