Chandra Bose On Indian Idol: మీరే తెలుగు సంగీతాన్ని ముందుకు తీసుకువెళ్లాలి....

Chandra Bose On Indian Idol: మీరే తెలుగు సంగీతాన్ని ముందుకు తీసుకువెళ్లాలి....
X
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో చంద్రబోస్; టాప్ కంటెస్టెంట్ కు నాటునాటు రాసిన పెన్ను బహుమతిగా అందిస్తానంటూ...
ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు ఇండియన్ ఐడల్ కు ఆస్కార్ కళ వచ్చింది. అకాడమీ పురస్కార గ్రహీత చంద్రబోస్ హోరాహోరీగా సాగుతోన్న ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ గాయనీ గాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి యువతే తెలుగు సంగీతాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లగలిగే సమర్ధులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ పర్ఫార్మర్ గా పేరుగాంచిన కంటెస్టంట్ కు నాటునాటు పాట రాసిన పెన్నును బహూకరిస్తానని వారిలో ఉత్సాహం నింపారు. చంద్రబోస్ తో పాటూ నాటు నాటు పాటను హృద్యంగా ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఏప్రిల్ 14, 15 తారిఖుల్లో ఈ కార్యక్రమం ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.

Tags

Next Story