Pragathi: వరుస సినిమాలతో బిజీ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెమ్యునరేషన్..

Pragathi: ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మరోవైపు కమెడియన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న నటీమణులు చాలా తక్కువమంది ఉన్నారు. అందుకే అలాంటి పాత్రలు చేయగలిగినవారికి ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. అలాంటి వారిలో ఒకరే ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న ప్రగతి.. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగులోనే కాదు.. సౌత్ భాషలు అన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ మార్క్ క్రియేట్ చేసింది ప్రగతి. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 3' చిత్రంలో ప్రగతి తన నటనతో అందరినీ నవ్వించారు. దీని తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'భోళా శంకర్'లో కనిపించనున్నారు ప్రగతి. ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా.. రెండిటిలో ప్రగతి జోరు కొనసాగుతోంది.
మామూలుగా చాలావరకు క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ రోజూవారీగా ఉంటుంది. అలాగే ప్రగతి కూడా రోజుకు రూ.50 వేల నుండి 70 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాను బట్టి తాను రోజూవారీగా కాకుండా ఒకేసారి పూర్తి రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి టాప్ ప్లేస్‌లో ఉంటుంది అనడానికి ఆశ్చర్యం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com