Chennai: సీనియర్ దర్శకుడి కన్నుమూత

తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ డైరెక్టర్ సాగర్ చెన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 73ఏళ్ల సాగర్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. స్టువర్టుపురం దొంగలు, ఓసినా మరదలా, అన్వేషణ, రామసక్కనోడు, అమ్మదొంగ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా పేరుగడించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన సాగర్ అసలు పేరు విద్యాసాగర్. సినిమాలపై అమితాసక్తితో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించిన సాగర్ అనతికాలంలోనే డైరెక్టర్ గా ఎదిగారు. శ్రీనూ వైట్ల, వివి వినాయక్ వంటి డైరెక్టర్లు ఈయన వద్దే దర్శకత్వంలో ఓనమాలు దిద్దారు. రొటీన్ కు భిన్నమైన కథలతో పేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సాగర్ ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ హోదాను దక్కించుకున్నారు. ఈయన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం అని ఇండస్ట్రీ పెద్దలు సైతం కితాబుఇస్తుంటారు. ఏమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com