Chiranjeevi : తారకరత్న ఆరోగ్యంపై చిరు ఎమోషనల్ ట్వీట్
ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఇందుకుగాను ట్వీట్ చేశారు. "సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. " అని చిరంజీవి ట్వీట్ చేశారు.
గుండెపోటుతో హాస్పిటల్ లో చికిత్సపొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తారకరత్న ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇటీవల హార్ట్ ఎటాక్ కు గురైన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు.