Chiranjeevi: అన్నాచెల్లెలుగా చిరంజీవి, నయనతార.. కన్ఫర్మ్ చేసిన తమన్..

Chiranjeevi: ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలు అందరూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు ఒప్పుకోవడంతో పాటు.. వాటి షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరు చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. వాటి షూటింగ్‌ను వేగంగా పూర్తిచేసే పనిలో పడ్డారు. తాజాగా తన అప్‌కమింగ్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను లీక్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.
మోహన్ లాల్ హీరోగా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం 'లూసీఫర్'. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. అయినా కథ నచ్చడంతో చిరంజీవి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ రీమేక్‌కు 'గాడ్ ఫాదర్' అనే టైటిల్‌ను ఖరారు కూడా చేశారు.
అయితే గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మూవీ టీమ్ ఎప్పుడో వెల్లడించింది. కానీ అది భార్య పాత్రా? లేదా చెల్లి పాత్రా? అనే కన్ఫ్యూజన్ ఇంకా ప్రేక్షకుల్లో ఉంది. తాజాగా ఓ షోలో తమన్.. తానే గాడ్ ఫాదర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నానని చెప్పడంతో పాటు.. అన్నాచెల్లెలుగా కనిపించే చిరంజీవి, నయనతార మధ్య ఓ మంచి సెంటిమెంట్ పాట కూడా ఉంటుందన్న విషయాన్ని లీక్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com