Chiru Pawan: మెగా బ్రదర్స్ పుట్టినరోజులకు ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్..

Chiru Pawan: స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. బ్యానర్లు, పేపర్లతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. ఎప్పటినుండి అయినా సినిమాల విషయంలో ఈ ఒక్కటి మారలేదు. ఇక తాజాగా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదయ్యింది. ఒకప్పటి స్టార్ హీరోల సినిమాలను కొత్త హంగులతో మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్‌లోనే పక్కా కమర్షియల్ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న 'పోకిరి'.. థియేటర్లలో విడుదలయ్యింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ప్రేక్షకులే విస్తుపోయేలా అనిపించింది. అయితే ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారనుందని అర్థమవుతోంది. ఇప్పుడు లైన్‌లో మెగా బ్రదర్స్ సినిమాలు ఉన్నాయి.
ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా 'ఘరానా మొగుడు' స్పెషల్ స్క్రీనింగ్‌కు సిద్ధమయ్యింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజున 'జల్సా' స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com