చిరంజీవి బర్త్‌‌‌డే గిఫ్ట్ : చిత్రపురి కాలనీలో 10 పడకల ఆసుపత్రి..!

చిరంజీవి బర్త్‌‌‌డే గిఫ్ట్ : చిత్రపురి కాలనీలో 10 పడకల ఆసుపత్రి..!
తన పుట్టినరోజు సందర్భంగా 24 విభాగాల్లోని సినీ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా చిత్రపురి కాలనీలో 10 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్టు ప్రకటించారు.

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 24 విభాగాల్లోని సినీ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా చిత్రపురి కాలనీలో 10 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్టు ప్రకటించారు. అపోలో ఆసుపత్రి సహాయకరాలతో వైద్య చికిత్స అందించేలా ఆసుపత్రి నిర్మాణం ఉంటుందని చిరు హామీ ఇచ్చినట్టుగా సినీ నటుడు శ్రీకాంత్ వెల్లడించారు. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా కరోనా లాంటి విపత్కరమైన సమయంలో సినీ కార్మికులకి నిత్యావసర వస్తువులు, టీకాలు వేయించారు చిరంజీవి.

Tags

Read MoreRead Less
Next Story