Chiranjeevi: 'ఆచార్య' ఫెయిల్యూర్‌పై చిరంజీవి కామెంట్స్..

Chiranjeevi: ఆచార్య ఫెయిల్యూర్‌పై చిరంజీవి కామెంట్స్..
Chiranjeevi: చిరంజీవి, రామ్ చరణ్‌ మల్టీ స్టారర్ చేసినా కూడా ఎందుకో ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

Chiranjeevi: సినిమా అనేది సక్సెస్ సాధిస్తుంది అన్న నమ్మకంతోనే దాదాపు 100 మంది సంవత్సరం పాటు దానికోసం కష్టపడతారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ అభిరుచి కూడా మారిపోయింది. అందుకే మేకర్స్ ఎంతో కష్టపడి తెరకెక్కించినా కూడా కొన్ని చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోతున్నాయి. అలా ఇటీవల భారీ పరాజయాన్ని ఎదుర్కున్న సినిమాల్లో 'ఆచార్య' కూడా ఒకటి.

కొరటాల శివ అంటే ఒక సోషల్ మెసేజ్‌తో మాస్ సినిమాలు తెరకెక్కించే పర్ఫెక్ట్ దర్శకుడు అని ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆచార్య తన లెక్కలన్నింటిని మార్చేసింది. చిరంజీవి, రామ్ చరణ్‌లాంటి ఇద్దరు మెగా హీరోలు మల్టీ స్టారర్ చేసినా కూడా ఎందుకో ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అందుకే ఇన్నిరోజులు దీనిపై చిరు స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ తాజాగా పరోక్షంగా ఆచార్య డిసాస్టర్ గురించి కామెంట్స్ చేశారు మెగాస్టార్.


అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా'ను తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నారు. అందుకే ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి చిరు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ సినిమాల విషయంలో రిస్క్‌లు చేయడానికి ముందుంటాడని ప్రశంసించారు. కానీ ఆయన మాత్రం అలా కాదని ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసే మినిమమ్ గ్యారెంటీ కథలనే తాను ఎంచుకుంటానని తేల్చేశారు.

ఒక్కొక్కసారి తన ప్రమేయం లేకుండా ఇతర అంశాల వల్ల కూడా లెక్కలు మారిపోతుంటాయని అన్నారు. చిరంజీవి.. ఆచార్య పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన ఆ మూవీ ఫెయిల్యూర్ గురించే మాట్లాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story