12 Jun 2022 10:35 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Chiranjeevi: ఒకే...

Chiranjeevi: ఒకే ఫ్రేమ్‌లో సల్మాన్, కమల్, చిరు.. 'విక్రమ్' సక్సెస్‌కు సన్మానం..

Chiranjeevi: తాజాగా చిరంజీవి కూడా కమల్ హాసన్‌ను విక్రమ్ మూవీ సక్సెస్ అవ్వడంతో సన్మానించారు.

Chiranjeevi: ఒకే ఫ్రేమ్‌లో సల్మాన్, కమల్, చిరు.. విక్రమ్ సక్సెస్‌కు సన్మానం..
X

Chiranjeevi: కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్.. తన హిట్ ఫామ్‌ను కోల్పోయారు. అందుకే రెండేళ్లుగా ఆయన ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్'.. కమల్‌కు స్ట్రాంగ్ కమ్ బ్యాక్‌నే ఇచ్చింది. దీంతో సినీ సెలబ్రిటీలంతా ఈ మూవీని చూసి కమల్‌ను అభినందిస్తున్నారు. తాజాగా చిరంజీవి కూడా ప్రత్యేకంగా కమల్‌ను ఇంటికి పిలిపించి సన్మానించారు.

విక్రమ్ సక్సెస్ అవ్వడంతో కమల్ సంతోషానికి అవధులు లేవు. అందుకే మూవీ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు ఓ కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు కమల్. లోకేశ్ టీమ్‌లోని 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు బైకులను బహుమతిగా అందించారు. ఇక రోలెక్స్ పాత్రలో కనిపించిన సూర్యకు రోలెక్స్ వాచ్‌నే గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా రజినీకాంత్, శివకార్తికేయన్‌లాంటి హీరోలు ప్రత్యేకంగా కమల్‌కు కలిసి తన మూవీ సక్సెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా చిరంజీవి కూడా కమల్ హాసన్‌ను విక్రమ్ మూవీ సక్సెస్ అవ్వడంతో సన్మానించారు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'విక్రమ్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో నా పాత ఫ్రెండ్ కమల్ హాసన్‌, డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్, సల్మాన్ ఖాన్‌తో కలిసి మా ఇంట్లో ఆ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాం.' అంటూ విక్రమ్ సినిమాను ప్రశంసించారు చిరు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Next Story