కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు

దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిశారు. దీపావళి పండగను పురస్కరించుకుని మెగాస్టార్ దంపతులిద్దరూ...స్వయంగా విశ్వనాథ్ దంపతుల ఇంటికెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి పండగ వేళ నూతన వస్త్రాలు అందజేశారు. ఆరోగ్యం గురించి ఆరా తీసి కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా చిరంజీవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని.. హత్తుకున్నారు విశ్వనాథ్.
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు కె.విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవిది..గురు శిష్యుల బంధం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఆపద్భాందవుడు, స్వయంకృషి వంటి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడమే కాక.. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చిరంజీవి కెరీర్‌లో క్లాసికల్ చిత్రాలుగా నిలిచాయి. విశ్వనాథ్ గారిని కలవాలనిపించి ఆయన ఇంటికొచ్చానని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు. తనకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారని, ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com