Megastar Chiranjeevi : చిరంజీవి కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్..!

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. పెద్ద హీరో మాత్రమే కాదు.. మంచి మానవత్వం ఉన్న మనిషి కూడా.. సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఇప్పుడు కరోనా లాంటి విపత్కరమైన సమయంలో ఆక్సిజన్ అందక ఎవ్వరూ కూడా చనిపోకూడదని మరో కీలక నిర్ణయం తీసుకున్నారాయన.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో చిరు ఆక్సిజన్ బ్యాంకును త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.
ఈ విషయాన్ని చిరంజీవి ఆఫీస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. వచ్చే వారం రోజుల్లో ప్రజలకి ఆక్సిజన్ బ్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్ల చేస్తున్నారు. జిల్లాలలోని చిరు అభిమాన సంఘ అధ్యక్షులు ఈ ఆక్సిజన్ బ్యాంకులను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలను చిరు తనయుడు రామ్ చరణ్ పర్యవేక్షిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com