Chiranjeevi: 'లాల్ సింగ్ చడ్డా'లో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: చిరంజీవి

Chiranjeevi: లాల్ సింగ్ చడ్డాలో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: చిరంజీవి
Chiranjeevi: అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘లాల్ సింగ్ చడ్డా’.. ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గ్రంప్‌కు రీమేక్‌గా తెరకెక్కింది.

Chiranjeevi: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.. చాలాకాలం తర్వాత బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. తీసిన ప్రతీ సినిమాకు రూ.100 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టగలిగే అమీర్.. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' ఫ్లాప్‌తో కాస్త వెనకబడ్డాడు. అందుకే తన అప్‌కమింగ్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'తో ఎలాగైనా హిట్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో చిరంజీవి కూడా భాగమయ్యాడు.

అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'లాల్ సింగ్ చడ్డా'.. ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గ్రంప్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించడం విశేషం. తాజాగా రాజమౌళి, నాగార్జున, చిరంజీవికి ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు అమీర్, చైతూ. ప్రీమియర్ చూసిన తర్వాత చిరంజీవి ఓ నిర్ణయం తీసుకున్నారు.


చిరంజీవి.. లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక తన ఇంటి వద్దే వారందరికీ ప్రీమియర్ ఏర్పాటు చేసినందుకు అమీర్ ఖాన్‌కు థాంక్యూ చెప్పారు చిరు.


Tags

Read MoreRead Less
Next Story