Chiranjeevi: మెగాస్టార్ తీరని కోరిక.. అలాంటి పాత్ర చేయాలని..!

Chiranjeevi: మెగాస్టార్ తీరని కోరిక.. అలాంటి పాత్ర చేయాలని..!
Chiranjeevi: ఇక సినిమాల నుండి రాజకీయాలకు వెళ్లిన చిరంజీవి.. మళ్లీ అభిమానుల కోసం సినిమాల్లోకి తిరిగి వచ్చేశారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి .. ఎన్ని మైలు రాళ్లు దాటితే.. ఎన్ని అవమానాలు సహిస్తే.. ఎన్ని ఛాలెంజ్ లను స్వీకరిస్తే.. ఎన్ని రివార్డులు పొందితే.. ఎన్ని రికార్డులు నెలకొల్పితే వచ్చిందీ పేరు. ప్యాషన్ కు స్వయంకృషిని జోడించి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అన్న మాటకు కూడా అక్షర రూపం ఆ పేరు.. నలభైయేళ్ల క్రితం.. నలుగురు.. ఐదుగురులో ఒకడిగా మొదలై.. టాలీవుడ్ కే నెంబర్ వన్ గా మారి.. కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకునే వరకూ చిరంజీవి ప్రస్థానం అనన్యసామాన్యమైనది..

ఇక సినిమాల నుండి రాజకీయాలకు వెళ్లిన చిరంజీవి.. మళ్లీ అభిమానుల కోసం సినిమాల్లోకి తిరిగి వచ్చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదు. యంగ్ హీరోలకు పోటీగా స్క్రిప్ట్స్‌ను వెంటవెంటనే ఓకే చేయడంతో పాటు వరుసగా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే 150కు పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి.. ఇంకా తీరని కోరిక ఒకటి ఉందట. ఆయన డ్రీమ్ రోల్ ఏంటో ఓ సందర్భంలో రివీల్ చేశారు చిరు.

తన కెరీర్‌లో తనకు భగత్ సింగ్ లాంటి పాత్ర చేయాలని ఉందని ఓ ఇంటర్వూలో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. కానీ తన వద్దకు దర్శకులెవరూ అలాంటి కథతో రాలేదన్నారు. ఒకవేళ వస్తే మాత్రం కచ్చితంగా అలాంటి పాత్ర చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. ప్రస్తుతం 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' వంటి చిత్రాల షూటింగ్స్‌లో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చిరంజీవి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story