మెగాస్టార్‌‌తో సూపర్‌‌‌స్టార్ కృష్ణ .. చివరికి రాజశేఖర్ కూడా చేయలేకపోయాడు..!

మెగాస్టార్‌‌తో సూపర్‌‌‌స్టార్ కృష్ణ .. చివరికి రాజశేఖర్ కూడా చేయలేకపోయాడు..!
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌‌లు మళ్ళీ మళ్ళీ రీపిట్ అయితే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు.. సహజమే కూడా.... అది హీరోహీరోయిన్ అవ్వొచ్చు.

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌‌లు మళ్ళీ మళ్ళీ రీపిట్ అయితే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు.. సహజమే కూడా.... అది హీరోహీరోయిన్ అవ్వొచ్చు, హీరో డైరెక్టర్ అవ్వొచ్చు. అలాంటి కాంబినేషనే సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. ఒకరేమో ఇండస్ట్రీలో తిరుగులేని సూపర్ స్టార్ అయితే మరొకరేమో ఎదురులేని మెగాస్టార్. వీరి కాంబినేషన్‌‌లో ఇప్పటివరకు మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అవే కొత్తపేటరౌడీ, తోడు దొంగలు, కొత్త అల్లుడు చిత్రాలు.

మళ్ళీ వీరి కాంబినేషన్‌‌లో సినిమా రాలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహంకోసం సినిమా షూటింగ్‌‌కి ముందు వీరిద్దరూ ఇందులో కలిసి నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం వార్తలుగానే మిగిలిపోయాయి. తమిళంలో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే వచ్చిన నట్పుక్కాగ అనే చిత్రం చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనీ అనుకున్నారు చిరు. అయితే విజయ కుమార్ చేసిన పాత్రకి ముందుగా సూపర్ స్టార్ కృష్ణని అనుకున్నారు మేకర్స్.

కానీ ఆయన్ని సంప్రదించలేదు. ఆ తర్వాత ఆ పాత్రకి హీరో రాజశేఖర్‌‌‌ని తీసుకోవాలని అనుకున్నారు. అందుకు రాజశేఖర్ కూడా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడే ఓల్డ్ రోల్స్ చేయడం వద్దని చిరంజీవి సూచించడంతో రాజశేఖర్ చేయలేకపోయారు. చివరకి తమిళ్‌‌లో చేసిన విజయకుమార్‌‌నే ఆ పాత్రకి తీసుకున్నారు. ఇద్దరి నటనకి మంచి మార్కులు పడ్డాయి. అక్కడ సిమ్రాన్ చేసిన పాత్రని తెలుగులో మీనా చేసింది. మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో కృష్ణ నటిస్తే బాగుండేదని ఇద్దరు నటుల అభిమానులు అనుకునేవారు.

Tags

Next Story