నాకు కోవిడ్ లక్షణాలు లేవు : చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు కరోనా పాజిటివ్ అంటూ స్వయానా చిరంజీవే నిర్ధారించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని. రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని. తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు అంటూ ట్వీట్ చేశారు.
ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వైద్యుల సలహోతో హోం క్వారంటైన్‌కే పరిమితమయ్యారు. అయితే ఇటీవల చిరంజీవిని కలిసిన వారిలో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. మరో స్టార్ హీరో నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్‌ను చిరంజీవి కలిశారు. ఫిల్మిసిటీ నిర్మాణం.. సినిమా షూటింగ్ అనుమతులు.. సినిమా హాళ్లు తెరవడం.. ఇతర సినిమా సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను కలిశారు.
పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి కోరారు. మరి సీఎం కేసీఆర్, నాగార్జునులు కూడా ఇప్పుడు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. ఇటీవల నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసుకోని తిరిగి హైదరాబాద్ వచ్చారు.. తాను టెస్టులు చేయించుకున్నానని.. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందంటూ బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పారు.. కానీ ఆ తరువాత చిరంజీవితో కలిసి సీఎం కేసీఆర్‌ను మీట్ అయ్యారు. దీంతో మరోసాని మన్మదుడు పరీక్షలు చేయించుకోక తప్పదు.. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో నాగార్జునతో కలిసి.. సుమ కూడా గెస్ట్ యాంకరింగ్ చేశారు. దీంతో ఆమె కూడా పరీక్షలు చేయించుకోక తప్పుదు.. అలాగే సీఎం కేసీఆర్‌ను సైతం చాలామంది కలుస్తూ ఉంటారు.. వీళ్లంతా ఇప్పుడు పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com