తెలుగురాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్ల విధానం మారాలన్న చిరంజీవి

తెలుగురాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్ల విధానం మారాలన్న చిరంజీవి
తెలుగురాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్ల విధానం మారాలన్నారు మెగాస్టార్ చిరంజీవి.. 'లవ్‌స్టోరీ' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ మెగాస్టార్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

తెలుగురాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్ల విధానం మారాలన్నారు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి.. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్‌స్టోరీ' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు కాదని, ఇది కొన్ని లక్షల మంది కార్మికుల జీవితమని అన్నారు. కరోనా సహా కొన్ని ఇబ్బందుల వల్ల సినిమా రంగం సంక్షోభంలో ఉందని, సినిమా ఖర్చు పెరిగింది.. వచ్చే రెవన్యూ తగ్గిందిని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మా విజ్ఞప్తుల్ని పరిశీలించాలని కోరుతున్నాం.. మేం ఆశగా అడగడం లేదు.. అవసరానికి అడుగుతున్నామని అన్నారు. సీటింగ్, బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్ల ఆంక్షల్ని పరోక్షంగా ప్రస్తావించారుచిరు... ఇప్పటికే జనం ధియేటర్లకు వస్తారా.. రారా అనే భయం ఉందని, సినిమాకి రెవెన్యూ వస్తుందా లేదా అనే ఆందోళన మాలో ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ధైర్యాన్ని, వెసులుబాటు మాకు ఇవ్వాలని కోరారు. మా కోరిక చెప్పుకున్నాం.. వీలైనంత త్వరలో జీవోలు ఇస్తే ధన్యులమని చిరంజీవి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story