Cinema: గుంటూరులో హంగామా...
ఎవరి సపోర్ట్ లేకుండా తన కష్టాన్ని నమ్ముకొని తెలుగు సినిమా పరిశ్రమలో నిలబడ్డాడు యువ నటుడు కిరణ్ అబ్బవరం. ప్రతిభ ఉంటే చాలు ఎలాంటి పరిస్థితులలోనైనా, ఎక్కడైనా నిలదొక్కుకోగమని నిరూపిస్తున్నాడు. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నవారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. తాజాగా కిరణ్ "వినరో భాగ్యము విష్ణు కథ" అన్ని పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇటీవలే ట్రైలర్ విడుదల చేయగా య్యూట్యూబ్‌లో భారీగా స్పందన వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా బృందం గుంటూరులో సందడి చేస్తోంది. VBVK vs VVIT కాలేజ్ విద్యార్థులకు క్రికెట్ పోటీ నిర్వహించి అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వ్యక్తితో సినిమాలోని రెండవ పాటను గురువారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై మురళి కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిచాడు. కిరణ్, కష్మీరా ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మురళి శర్మ సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com