Cinema: బేబమ్మ పని అయిపోయినట్లేనా....!

Cinema: బేబమ్మ పని అయిపోయినట్లేనా....!
వరుస సినిమాలతో అలరించిన కృతి శెట్టి, సడన్ గా డల్ అయిపోయిన బేబమ్మ; ఆఫర్లు లేక దిక్కులు చూస్తోన్న భామ్మ...

బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన కృతి శెట్టి ఆ మధ్య వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి దర్శక-నిర్మాతల పట్ల కల్పతరువుగా మారిపోయింది. కానీ, ఆ వైభోగం ఎక్కువ రోజులు కొనసాగలేదనే చెప్పాలి. క్రమంగా ఆమె సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం ఫ్లాపులతో పూర్తిగా డీలా పడిపోయింది. ప్రస్తుతం అమ్మడి దగ్గర కస్టడీ తప్ప మరే ప్రాజెక్ట్ లేదనే చెప్పాలి. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాపైనే ప్రస్తుతం అందరి దృష్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు చైతన్యకు, అటు కృతికి ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం అనే చెప్పాలి. ముఖ్యంగా కృతి కెరీర్ దిశా నిర్దేశం ఈ సినిమా సక్సెస్ పైనే ఆధారపడి ఉంది. కస్టడీ హిట్ అయితేనే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. ఇక ఈ సినిమాకు బంగార్రాజు లక్ కలసి వస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. అదే నిజమైతే అందరికీ మంచిదే మరి..


Tags

Read MoreRead Less
Next Story