Cinema: ఆకట్టుకుంటోన్న రుద్రాంగి టైటిల్ సాంగ్

Cinema: ఆకట్టుకుంటోన్న రుద్రాంగి టైటిల్ సాంగ్
జగపతిబాబు కీలక పాత్రలో తెరకెక్కిన రుద్రాంగి; ఖైలాశ్ ఖేర్ ఆలపించిన టైటిల్ సాంగ్....

జగపతిబాబు కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం రుద్రాంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రోమోలు, పాటలు ఇప్పటికే జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ రిలీజ్ అవ్వగా అందులో ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ముఖ్యంగా ఖైలాశ్ ఖేర్ స్వరం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాఫల్ రాజా సంగీత దర్శకుడుకాగా, మనుకోట ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. ఇక ఈ సినిమాలో జగపతిబాబుతో పాటూ విమలారామన్, మమతామోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఆశిష్ గాంధీ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. మరి చాలా రోజుల తరువాత లీడ్ రోల్ చేస్తున్న జగపతిబాబు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.


Tags

Next Story