Cinema: హీరోగా పాటల రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు

Cinema: హీరోగా పాటల రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు
X
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న ప్రణవ; శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరెక్కిన దోచేవారేవరురా!
హీరోల వారసత్వం కొనసాగిస్తూ వారి తనయులు సినిమాల్లోకి రావడం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. అయితే అప్పుడప్పుడూ రొటీన్ కు భిన్నంగా సాహితీవేత్తల తనయులు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తమ అదృష్ఠాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ కోవలోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనయుడు రాజా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. తాజాగా ప్రముఖ పాటల రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వస్తోన్న 'దోచేవారెవరురా' సినిమాతో ఎంట్రీ ఇస్తోన్న ప్రణవ చూడచక్కగా ఉన్నాడు అనడంలో సందేహమేలేదు. అయితే అబ్బాయి ఇప్పుడంటే హీరోగా పరిచయం అవుతున్నాడు అన్న మాటే గానీ, ఇండస్ట్రీకి అయితే కొత్తేమీ కాదు. ఇంతకు మునపే సినీరంగంలో వివిధ విభాగాల్లో పనిచేశాడు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశాడు. అలా క్రమంగా ఒక్కో మెట్టూ పైకి ఎక్కుతూ హీరోగా తొలి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ప్రణవ. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న 'దోచేవారెవరురా'లో ప్రణవకు జోడీగా మాళవిక నటిస్తోంది. సీనియర్ నటుడు అజయ్ ఘోష్, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ప్రణతి సాధనాల సినిమలో ప్యారలెల్ లీడ్ గా నటిన్తున్నారు. మరి ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కిన 'దోచేవారెవరురా' ప్రేక్షకులను అదే రీతిన అలరిస్తుందేమో చూడాలి.

Tags

Next Story