Cinema: రామబాణాన్ని సంధించనున్న గోపీచంద్

Cinema: రామబాణాన్ని సంధించనున్న గోపీచంద్
X
లక్ష్యం, లౌక్యం సక్సెస్ ను రీపీట్ చేసేందుకు సిద్ధమవుతున్న గోపీ-శ్రీవాస్; రిలీజ్ డేట్ ఫిక్స్ చేయిన చిత్ర బృందం

మాచో హీరో గోపీచంద్ డైరెక్టర్ శ్రీవాస్ తో మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కే తన 30వ సినిమా బాధ్యతలను అప్పగించిన గోపీ రామబాణాన్ని సంధించేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతి సమయంలోనే ఈ టైటిల్ ను అనౌన్స్ చేయగా, తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసింది . వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు మే నెల కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా అందరూ సినిమాను ఆశ్వాదించేందుకు 5వ తారీఖే బెటర్ అని భావిస్తున్నారు. దీంతో గోపీచంద్ వేసవి బరిలోకి దూకేసినట్లే. మరి ఈ కోవలో ఇంకెంత మంది హీరోలు దిగుతారో చూడాలి.



Next Story