Cinema: జల జల జలపాతం... నువ్వు..!

Cinema: జల జల జలపాతం... నువ్వు..!
తారక్ 30లో మెరిసిన జాన్వీ కపూర్, ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

అతిలోకసుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ రాక కోసం టాలీవుడ్ దశాబ్ది కాలంగా ఎదురుచూస్తోంది. అమ్మాయి కౌమరంలోకి అడుగుపెట్టిన నాటి నుంచే ఆమెను ఇక్కడ లాంచ్ చేసేందుకు దర్శక-నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, ఇప్పటి వరకూ దానికి ముహూర్తం కుదరలేదనే చెప్పాలి. అయితే అమ్మడిని లాంచ్ చేసే అదృష్టం కొరటాల శివ దక్కించుకున్నారు. తారక్ 30లో జాన్వీ కపూర్ హీరోయన్ గా ఖరారు అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో జాన్వీ పుట్టిన రోజు సంద్బంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. జలపాతం నడుమ తలెత్తిన ఉప్పెనలా జాన్వీ అందం కట్టిపాడేస్తోందనే చెప్పాలి. మరి ఫస్ట్ లుక్ తోనే ఈ రేంజ్ లో సెగలు పుట్టిన జూనియర్ అతిలోక సుందరి టాలీవుడ్ జనాలను ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story