Cinema: టీజర్ అదిరింది..

Cinema: టీజర్ అదిరింది..
రావణాసురగా రానున్న మాస్ మహారాజ్ రవితేజ; యూట్యూబ్ ను షేక్ చేస్తున్న టీజర్

మాస్ మహారాజ్ రవితేజ మరోసారి యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. రావణాసుర సినిమాతో బాక్సాఫీస్ పై దండెత్తేందుకు సిద్ధంగా ఉన్నాడు. మామూలుగానే పూనకాలు తెప్పించే రవితేజ స్టైలిష్ మోడ్ లో అగ్రెసివ్ లుక్స్ తో సూపర్ కూల్ గా కనిపిస్తున్నాడు. ఈరోజే రావణాసుర టీజర్ విడుదలవ్వగా మాస్ మహారాజ్ ఓ రేంజ్ లో రఫ్పాడించేయడం ఖాయంగా కనిపిస్తోంది. రొటీన్ కు భిన్నంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనువిందు చేస్తుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుధీర్ వర్మ చెక్కిన ఈ మూవీలో మాస్ మహారాజ్ తో పాటూ సుశాంత్, అను ఇమాన్యుయెల్, ఫారియా అబ్దుల్లా, మేగా ఆకాశ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సెసిరోలియా ఈ చిత్రానికి సంగీతం అందించగా... కథ, డైలాగులు శ్రీకాంత్ విస్స రాశారు. మరి టీజర్ తోనే పూనకాలు తెప్పించేస్తున్న మాస్ మహారాజ్ థియేటర్లను ఏవిధంగా ఊపేస్తాడో చూడాలి.Tags

Read MoreRead Less
Next Story