Cinema: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం

తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్, తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. శివం సెల్యులాయిడ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్-2గా ఒక సరికొత్త లవ్ యాక్షన్ డ్రామా రూపొందనుంది. ఈ చిత్రం ద్వారా విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో పూజాకార్యక్రమం నిర్వహించి లాంఛనంగా సినిమాను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు కె.ఎస్.రామారావు, జెమిని కిరణ్, శిరీష్, వల్లభనేని వంశీ, నల్లమలపు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోదరప్రసాద్, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com