Cinema: అందరికీ నచ్చే లిల్లీ...

Cinema: అందరికీ నచ్చే లిల్లీ...
పాన్ ఇండియా బాలల చిత్రంగా లిల్లీ; వివిధ బాషల్లో ఒకేసారి విడుదలవుతున్న సినిమా

ఈ మధ్యకాలంలో పూర్తిస్థాయి బాలల చిత్రాలు రావడమే లేదని చెప్పాలి. ఆ లోటు భర్తీ చేసేందుకు లిల్లీ మన ముందుకు వస్తోంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఓ మంచి సందేశాన్ని అందించే చిత్రంగా లల్లీని రూపొందించారని తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని సాంగ్ రిలీజ్ అవ్వగా అందరి హృదయాలనూ కట్టిపాడేసింది. తాజాగా సినిమా ట్రైలర్ కూడా విడుదలయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లిల్లీ’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. గోపురం స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో నేహా, వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి, రాజ్ వీర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివమ్ దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నారు. ఇక తొలి పాన్ ఇండియా బాలల చిత్రంగా లిల్లీ కొత్త రికార్డ్ నెలకొలపబోతోందనే చెప్పాలి. తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ బాషల్లో ఈ సినిమా విడుదలవ్వబోతోంది. కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌లు నిర్మాణ సారధ్యంలో తెరెకక్కిన లిల్లీ ట్రైలర్ విడుదలైన కాసేపట్లోనే మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఏమైనా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని చిత్ర బృందం కోరుతోంది.

Tags

Read MoreRead Less
Next Story