Cinema: దాసు ఈసారి గట్టిగానే కొట్టేట్టు ఉన్నాడే...

Cinema: దాసు ఈసారి గట్టిగానే కొట్టేట్టు ఉన్నాడే...
విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న దాస్; మార్చ్ లో ముహూర్తం ఖరారు చేసుకున్న దాస్ కా ధమ్కీ...

విశ్వక్శేన్ ఈసారి పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వేసవి బరిలోకి దిగుతున్నాడు. దాస్ కా దమ్కీ మూవీతో నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా, నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాలో నివేతా పేతురాజ్ విశ్వక్శేన్ కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య విడుదలైన ట్రైలర్ 1.0 ప్రేక్షకులను కట్టిపాడేయగా, తాజాగా రిలీజ్ అయిన 2.0 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ ను బట్టీ సినిమాలో విశ్వక్సేన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలుస్తోంది. మొదటి ట్రైలర్ లోనే కథ గురించి కాస్త చెప్పినప్పటికీ, రెండవ ట్రైలర్ కోర్ పాయింట్ ను రివీల్ చేసింది. కథా, కథనంలో మాత్రం మస్త్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని తెలుస్తోంది. ఏమైనా మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ కా దాస్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story