Cinema: ఆద్యంతం వినోదాత్మకంగా "భువన విజయం"

X
By - Chitralekha |13 March 2023 5:22 PM IST
ఆకట్టుకుంటోన్న "భువన విజయం" టీజర్
టాలీవుడ్ సీనియర్ కమెడియన్లు అందరూ ఒక్క చోట చేరితే ఇక చక్కిలిగింతలకు కొదవేమిటి అంటారు. ఈ కోవలోనే వస్తోంది 'భువన విజయం' సినిమా. సునీల్ కీలక లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ధనరాజ్, శ్రీనివాస రెడ్డి, హర్షా చెముడు వంటి స్టార్ కెడియన్స్ కనువిందు చేయనున్నారు. ఆసక్తికరమైన కథా, కథనాలతో రెండున్నర గంటల పాటూ నవ్వించేందుకు సిద్దమయ్యారు. చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా మంచి స్పందన లభిస్తోంది. ఇక శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. సాయి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి ఆత్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన భువన విజయం ప్రేక్షకులను ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com