Cinema: వేసవిలో 'గీతసాక్షిగా'...

సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు తెరరూపం ఇస్తూ గీతసాక్షిగా మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆదర్శ్, చిత్రా శుక్రా జంటగా నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ అవ్వగా, దానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ఇటు క్లాస్, అటు మాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన ఆదర్శ్ ఈ సినిమాలో హీరోగా ఆరంగేట్రం చేయబోతున్నాడు. సిల్వర్ స్క్రీన్ కు తగ్గట్లు సిక్స్ ప్యాక్స్ బాడీతో స్టైలిష్ గా కనిపిస్తోన్నాడు. ఇక చిత్ర శుక్లాకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించిందనే చెప్పాలి. మరి విభిన్నమైన కథా,కథనాలతో మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గీతసాక్షిగా ప్రేక్షకులను ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com