Cinema: మనసుకు హత్తుకునే 'ఓ సాధియా'

Cinema: మనసుకు హత్తుకునే ఓ సాధియా
ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న 'ఓ సాథియా'; సాంగ్ రిలీజ్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను తెలుగు ప్రేక్షకుల ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇదే కోవలో రూపొందిన 'ఓ సాథియా' రూపొందుతోంది. ప్రేమకథలో కూడా ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా నిర్మాణ సారధ్యంలో తెరెకక్కిన ఈ చిత్రానికి దివ్యా భావన దర్శకురాలిగా పరిచయం అవ్వబోతున్నారు. దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం మరో విశేషం. ఆర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన నేల మీద లేనే సాంగ్ రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, వినోద్ కుమార్ (విన్ను) స్వరాలు సమకూర్చారు. ఈజే వేణు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story