Cinema: 'కఫీఫీ' అంటూ కొత్తగా....
త్వరలోనే విడుదలకు సిద్దమవుతోన్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' టీమ్ నుంచి రోజుకొక ముచ్చట బయటకు వస్తూనే ఉంది. అంతేకాదు, అలా వస్తున్న పాటలు, ప్రోమోలు అన్నీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. తాజాగా విడుదలైన పెప్పీ నెంబర్ 'కఫీఫీ' ఈ అంచనాలను మరో రేంజ్ కు తీసుకెళ్లిపోతున్నాయి. ఈ సినిమాలో మొత్తం అయిదు పాటలు ఉండగా నాలుగు పాటలకు కళ్యాణీ మాలికి, ఒక పాటకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఇప్పటికే కల్యాణీ మాలిక్ అందించిన పాటలు విడుదలయ్యి మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజా పాటకు వివేక్ సాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ పాట కూడా యువతను వివరీతంగా ఆకట్టుకుంటోంది. మరి మార్చి 17న విడుదలకు సిద్ధమవుతోన్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com