Cinema: ఫీల్ గుడ్ మూవీగా వస్తోన్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'

ఫీల్ గుడ్ మూవీగా వస్తోన్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'
తెలుగు ప్రేక్షకులకు ప్రేమకథలపై ఉన్న మక్కువ ఈ నాటిది కాదు. అందమైన ప్రేమకావ్యావలను హృద్యంగా ఆవిష్కరించిన దర్శకనిర్మాతలంటే మనోళ్లకు ప్రత్యేకమైన అభిమానం. ఇక తెలుగువారి ఇష్టాఇష్టాలకు తగ్గట్లే రూపొందిన చిత్రం 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో రాజేష్ దొండపాటి డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉగాది సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మరో అప్డేట్ గా టీజర్‌ను రిలీజ్ చేసింది. డైరెక్టర్ శ్రీవాస్ రిలీజ్ చేసిన 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్‌లో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జానర్లను చూపించారు. ఇక పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా కలిసి వచ్చేలా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com