Cinema: బ్రహ్మీకి 'చిరు' సత్కారం

X
By - Chitralekha |23 March 2023 3:35 PM IST
రంగమార్తాండలో హృద్యమైన నటనతో ఆకట్టుకున్న బ్రహ్మానందం
నవరసాలతో ఆడుకుంటూ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించడమే కాదు, గుండెలు పిండేలా ఏడిపించగలనని నిరూపించుకున్నారు బ్రహ్మానందం. కమెడియెన్ గా అంచంచలైమైన అభిమానాన్ని సంపాదించుకున్న బ్రహ్మీలో ఇంతటి నటనా పటిమ దాగుందని రంగమార్తాండ ద్వారా నిరూపితమైంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన రంగమార్తాండ ఇటీవలే విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఇదే కోవలో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మీకి చిరు సత్కారం చేసి అభినందించారు. తన ఆప్తమిత్రుడు ఇలానే మరిన్ని హృద్యమైన పాత్రలు పోషిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com