Cinema: శకుంతల రాజసం
By - Chitralekha |23 March 2023 10:42 AM GMT
వజ్రాభరణాల ధగధగల నడుమ శాకుంతలం హంగామా
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తోన్న దృశ్యకావ్యం శాకుంతలం ప్రచార కార్యక్రమాలు జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ ప్రోమోలు సినిమాపై ఓ మోస్తరు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. శకుంతల పాత్రలో సమంతను చూసేందుకు ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వసుంధర వజ్రాభరణాల సంస్థతో చేతులు కలిపిన శాకుంతలం బృందం రాజసం ఉట్టిపడేలా ఠీవిగా ఉన్న సమంత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో సామ్ రాజమాతలా కనిపిస్తోందనే చెప్పాలి. మరి చారిత్రక కథల్లోనూ మనకు తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించే గుణ శేఖర్ శాకుంతలంతో ఎలాంటి సప్రైజ్ ఇస్తాడో చూడాలి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com